8వ పాట ఆదితాళము
ఈశ్వరా, సూర్యవంశమూనా,యిక్షువాకనె రాజయా,అతడు బ్రహ్మనుగూర్చి, యాఘోర తపమే జేసెనూ, అనేకా వెయ్యేండ్లకూను హంసవాహన మెక్కుకా, అతనికిని ప్రత్యక్షమాయను, ఆదిబ్రహ్మదేవుడూ, యేమిటీకీ తపము జేస్తివి, యరుగ మాతో జెప్పమంటె. మీకు దైవామైన దేవాపూజ యిమ్మని యడిగెను. యిస్తినోయీ రాజశేఖర, యిదిగొ కొమ్మని పలికెనూ, తపములు చాలించి బ్రహ్మకు దండమొప్పుగ బెట్టెనూ:ప: ఆదిపూర్వము, వీరుల వార్తలు, అవధరించుడి పెద్దలు. తోయజా పుష్పాండ జయముని తొగటవారి గురువయా. కచిత్తము, గురువు దైవము. వేదశాస్త్రము వినరయా:ప: 1
రంగస్వామి, కామండల తీర్థము. రమ్యముతో యిచ్చెనూ, అందుకొనెనే, రాజశేఖరుడధిక సంతోషంబునూ, దైవమాయని, తలచి కమండల తీర్థము, తామెరా కొలనులోపల విడిచెనూ పుట్టెనే పుష్పాండ జయముని పుణ్యతామర పూవునా, అతనిజూచి యిక్షువాకూ, ఆశ్చర్య మొందెనూ, మహాత్మా మీరెవ్వరయ్యా, మహా చోద్యములాయెనూ నీవుచేసిన బ్రహ్మ తపమున,నిజముగ నీ తనయునీ భాసురంబుగ తండ్రినీవని, భాహులెత్తి మ్రొక్కెనూ:ప:1: కరుణతోడుత కొమారుణ్ణి, గారవంబున బిలుచుకా, ఆనందముతో యిద్దరూ అయోధ్య పట్నానికి వచ్చిరి. రాజ్యమేల్మని కుమారునికీ,రాయ పట్నము గట్టెనూ యేలెనే పుష్పాండ రాజై యేడు దీపాంత్రాలునూ, యినకులావంశాబ్ది చంద్రుడు ,యిట్లు యేలుచుండగా,వంశగురు వశిష్టు వచ్చెను.
పుణ్యకాలము నాడయా అట్టిగురువును జూచిరాజూ అనేకా పూజించెనూ, సాష్టాంగ మ్రొక్కితే, సత్యవాక్యముల దీవించెనూ:ప:3: యంతోవేడుక సేవించెను, సంతోషంబే చేసెనూ గురువుకన్నా దైవమేది, గుణముగల్లవారికి యిటువలెనే సేవజేయుచు, వినయార్థముతోనయా, వినవయ్యా గురుస్వామి, విన్నపము నాదొక్కటీ, అతనిభావము, హృదయమందు అంతయూతా తెలుసుకా .యేమివార్తా తెల్పుమాని, వేడుకాతో అడిగెనూ. ఎక్కువ యవరు ముగురు మూర్తులు, కాగములు, సేవింతునూ ముదముతో, ఆదిత్యమైన, మూలమంత్రము దెలుపుమా, శిశువు మాటల వినియు గురువు, చిరునవ్వేనవ్వెనూ, పరబ్రహ్మ పరతత్వమైన పరంజ్యోతే కారణం:ఫ6:
భక్తితో గురుపాదములకు, మ్రొక్కి యానతిమ్మనే, భరితమైన, ఓంకారమంత్రము, భావమంతయు తెలిపెనూ, తప్పక ఈ మంత్రజపమున, తపములూ సేవింపుమా, శాంభవీనీకు సాయమవునని: చాల ఆనతిచ్చెనూ,గురువుచే వుపదేశమందెను, దివిజులందరు మెచ్చగా. తల్లిదండ్రికిమ్రొక్కి ధర్మదీవెనాలె అందెనూ, భూసురులు బుధులు మెచ్చగ, పూర్వ తామెర కొలనకూ, పుణ్యతా నుజ్ఞానమున పుష్పాండు డక్కదపోయెనూ, పదివేల ఘోరతప, బ్రహ్మాండ భాండముగజేసెను. పంచముఖముల పరంజ్యోతికి భావమక్కడ నిలచెనూ,: ప: : పారిజాతమైన తల్లి ప్రత్యక్షమై తానిలిలచెనూ, ఓంకార తపసి నీకూ యేమికావలె యడుగుమా, అట్టెతపములు చాలించి ఆదిలక్ష్మికి మ్రొక్కెనూ. అన్నిటానుగలిగినా జగదాంబతో నిట్లనియెనూ, సహంతన సౌభాగ్యమూలూ, చాలయిమ్మని అడిగెనూ, తప్పకా మావంశమూన ధర్మదేవతై నిలువుమా, దివిజులెరుగగ అభయమిచ్చెను, దివ్యమంగలమూర్తీ, వార్తగా త్రిపురాలు గెలచీ, వస్తూ మీకులదైవమై:ప:4:
దేవశంకరి నీవెదిక్కని జ్ఞానముతోయుండెనూ, మహాశక్తై త్రిపురములకూ, మాయలే కల్పించెనూ.సాహసంబుగ రాక్షసూలు: సకల లోకమూలనూ, అల్లకల్లోలంబు చేయగ, అఖిల దేవత లదిరిరి అప్పుడూనూ ముగురు మూర్తులు, ఆదిపరంజ్యోతినీ, అనంతకోటి వేదమాతను, ఘోరముగ కొనియాడిరీ, వచ్చిరావీ చెట్టునోమూ, ఫలమునా, వారిలో ఉదయించెనూ చట్టుబండన శివుని చమటన దేవి వుద్ధ్వటించెనూ, సకల దేవతలు శాశలెగ పూష్వాండ జయముని పోయి మ్రొక్కెను, శాసబియ్యామిచ్చి శాంభవి,శాయమైతిని పొమ్మనే, ఒచ్చి అగ్ని గుండమందూ హోమమూలు జేసితే వైభోగవీరులు బుట్టిరీ చౌడమ్మ వెంట త్రిపురాలు గెలచి గురుదైవములకె మ్రొక్కిరీ, అభిమాన రక్షక వీరులానీ, ఆదిదేవతలందరూ, పంచవన్నె వస్త్రాల విద్యకు , పట్నమమర గట్టిరీ, కులదైవమైనతల్లీ , పదములు గురము సరువయ్య పాడెనూ, మదిలోనా దూర్వాసముని దేవుడైతాబలికెనూ:ప:3: