2వ పాట-ఆదితాళము
నొసటమెరుగుడ్డులే పసనంబు కోరలే | పసని నల్లనిరూపు బాలఓయమ్మా| పసనై కస్తురిబొట్టు నీలి పొత్లము గత్తి |దిట్టముగా నందపురి చౌడేశ్వరమ్మా భూలోక మాతవే| భుజబలములే మాకూ, విద్య బుద్దుల గురువు రావో చౌడమ్మా| భూలోక మాతవే| భుజబలములే మాకూ|ప||
వజ్రాలు దాపినా బొద్దులా కడియాలు గద్దరింపుచు జంగ కాళిపెండెములూ భద్ర కాళివి రావో |భూ|ప|1|
బహుళ శంకరి నీవూ సిద్ధముగ రతివీర చౌడమ్మ రావో|భూ|ప|2|
నడిమి వడ్డాణమే నాగబోనము తొడగి నాడు పూజలు చేయ నేడు వేడుకలాయె | ఆదిశక్తీవని వేదములు చదివేరు మోదముతొ నిను కీర్తించేరు చౌవుడూ| ప|3| పసని బండారులే రతులు పూజలుచేయ రతులందు వస్తిమీ రతికళలు నిలిచీ, జగతి ప్రఖ్యాతిగా యేలితివో తిప్పమను, మతి లోన వెలసితివో మహమ్మాయి చౌడూ|భూ|ప|1
|