జ్యోతి ఆరాధనా పద్యములు
1వ పాట ఆదితాళము
గణపతి ప్రార్థన
పార్వతీ పుత్రుండు © పరమేశ్వరుని జూడ
ఎలుక వాహనమెక్కి © వెళ్ళె తనుయాటా
అమరంగ వెనుకయ్యను © ఆత్మలో దలచేరు
సంతోషములు గలుగు © సకల జనులకును
హర హరా మిముదలచు © హరుని పుత్రుండు !!ప!!
సకల విద్యల గురువు © స్వామి గణనాథా !!హరహరా!!
హర హరా మిముదలచు హరుని పుత్రుండు !!పల్లవి!!
విష్ణు బృహ్మ దేవుడీశ్వరుడు మొదలుగా | మదిలోన వెనుకయును మరువక దలచేరు|
సర్వ దళములతోన సాధించె త్రిపురాలు | కైలాస వాసనుడు కార్యాన దలచె | !!పల్లవి!!1!!
వేద శాస్త్ఱాలందు ఎంచేరు వెనుకయను | మోదముగ సిద్దులే మ్రొక్కి తలచంగా |
సంగీత సాహిత్య సకల విద్యలకెల్ల | రవికోటి తేజకుడు రాజు వెనకయ్యా !!పల్లవి!!3!!
ఎన్నగల దేవతలు వెనుకయను దలచేరు | వ్యాస వాల్మీకులే వెనుకయను దలచేరు
కలిగె వైభొగములు కలకాలమెల్ల |సప్త మహారుషులకే స్వామి వెనుకయ్యా !!పల్లవి!!4!!
కురుచనీ పాదాలు గుజ్జురూపున బొజ్జ | ఏకదంతము తొండమేనుగారూపూ |
పాలించి గుర్రము సరువయ్య మతిలోన గౌరమ్మ నీకొడుకు కరుణతోనేలే | హర హరా |ప|