Sri Nandavara Chowdeswari Devi & Thogata veera kshatriya
  26 Haruni chamatana
 

26వ పాట:: హరుని చమటన

హరుని చమటన- కాసిలోపల- అసురసంహరి చౌడుబుట్టెను-వేదబ్రాహ్మణ సాక్షికొరకై వెలసె నందవరమునా- పదనార్గుర సంహరించి-  ఖరామొండెమూలచేసి, శిరులు మించు ఓంకాళిశక్తై

శివానందుల కోటనా- పేరుగా పెదవాడయందు ఘోరరూపముతోనయా- దురితమూగ ఓరుగంట దుర్గివై తావెలసెనూ- రాయభూపతి- బిరుదునిలిపెను- రాజ్యములగొనిపోక చౌడమ- హృదయరాజుల-

పానుగంటా సదానదామూర్తివి ||||

 

అష్టదశపీఠాలు వెలసిన- ఆదికాలము చౌడమా-  సాయమాయెను హరుని బిడ్డా- చాలనమ్మీకొల్వరో ||1|  దండిదురితుల చెండివేసెను- స్మారమున తనకొండనా- భద్రకాళీ- వుదయగిరిన- రుద్రమూర్తివో చౌడమా- నేరుపురి నెల్లూరి స్థలమున- నెరయ కంచి పట్నమందూ-

కనకవైభోగములతోనా- కామాక్షైతా వెలసెనూ- పంచమైజ్యోతూలతోనా భాహురె రేపల్లెచౌడమ వెలయ ముగురికి తల్లి తానై గాలిపూజా గట్టెనూ- చెలగిశ్రీరంగపట్నమందు- చామండి చౌడేశ్వరమ్మా- తీరుగా తిరుమాలపురమున వీరమూర్తివోచౌడమా|||1| 

 

శంభుమూరితి, తుంబురాన- చెలగె వేడుకతోనయా- భానుకోటి తేజములనూ- భావపురమున చౌడమా- చాలయేడ్గురి దేవరాజుల చారుకొలతలు వేశిగెలచెను- దేవశంకరి తాండ్వమాడెను-

దేవగిరిగుర్గాననూ- భాద్రిష్టి ఆయుధాలుతీసుక బలుదైతులమీదికీ- బలిమిసింహ్మామెక్కి నడచెను- ఘనత చౌడమ ముందయా- లంకలో భయంకారివయ్యు- రాముకార్యము జయము చేస్తివి- మళీయాళ దేశమందూ- మహాశక్తై వెలసెనూ|||3| మంత తంత్రమార్గములకూ-

 మహిమతోడుత సాయమాయెను- కొల్లపురమున హృదయలక్ష్మి  కోర్కెలు వీడేర్చెనూ- మదిలోవితివనితలతురమ్మా- ఆత్మలో కల్యాణివమ్మ- పట్టిపూజలు గొంటివమ్మా పరమాకల్యాణివీ-ముజ్జగంబులు గల్గియుండిన- వుజ్జనీ మహంకాళివమ్మ- మొదట సిద్ధుల కొలువుదీర్చిన- మగుటమాయర- జలమ్మా అమ్మనిన్ను తలచెటందుకు-  అలివిగాదే- యెవరికైన మాపాలిటీ మధురాక్షివమ్మా- మధురలో నెలకొంటివీ ||| అంబజెగాదాంబవమ్మ అలాంపూరి జోగులాంభ

కరుణతోడుత ప్రజలనేలిన కందనూరి చౌడమా- ఘనతమించగవినుతికెక్కగ- గంగపురము చౌడమా-

చాలనొప్పుగ మీనవరమున మేలుశాంభవినీవమ్మా, అనుమానము లేక- అనుమానుగల్లా చౌడమా- హరునికీ బిక్షంబు పెట్టిన- అన్నపూర్ణవు నీవమ్మా ఈశ్వరునికీ- బిడ్డవయ్యూ.

విశ్వరూపముతోనవెలసి- ఆదిదేవతలకభయమిచ్చిన- ఆదిశక్తివినీవమ్మా|||

 

గౌరుపార్వతి గారువంబున- అమరులాకూ తల్లివమ్మా స్థిరముగా భ్రమరాబవయ్యు- పర్వతా నెలకొంటివీ- ఓంకాళి గోరంజివాయి వరుసరాజుల- కెరుకజెప్పిన నాదభేదములన్నిటికి బహునాంచారివి నీవమ్మా- అనంతా కాలమునాడూ ఆదిపరంజ్యోతివమ్మా చౌడూనిన్ను నమ్మికొలచినవారీకి- సకల భాగ్యములిస్తువూ యనంగా- యేన్నూరుకోట్ల భూమండలాన నిండువేడుక, మందరాగిరి పర్వతాన- మలయ తాండవమాడగా||| కాశిగంగా, కావేరుకలుగు

పుణ్యతీర్థమూలు ప్రజల ప్రవణం జేస్తివో- భాకీర్తివయ్యు ధరణిలో- ఆదిపూర్వము గుఱ్ఱము సరువయ అమృతవాక్యములిస్తివి-  అష్టదిక్కుల నెలకొన్నా దిష్టమూర్తి ఓ చౌడమా- యతుల మునులకు అభయమిస్తివి. 

గుఱ్ఱంసర్వుయ్య మదిలొనుంటివి. నాలుగుయుగమూలకూ జగన్నాధవో  చౌడేశ్వరీ, సంతసంబుతో గుఱ్ఱము సర్వుయను స్వామినీవే నేలుకొంటివి- జయముతోడుత గుంటుమల్లూ చౌడు మహిమలు తెలియరో||| 

 

 

 
  Today, there have been 11 visitors (15 hits) on this page!  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free